Andhra Pradesh: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.... అస్త్రాలతో సిద్ధంగా ఉన్న అధికార, విపక్షాలు!

  • ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధం
  • సభ వాడీవేడిగా జరిగే అవకాశం
  • సమావేశాలు ఎన్నిరోజులు జరగాలో రేపు బీఏసీ భేటీలో నిర్ణయం
రాష్ట్రంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగడం ఖాయమనిపిస్తోంది. ప్రధానంగా ఆరు నెలల పాలనను దృష్టిలో ఉంచుకుని ఉల్లిధరల పెంపు, ఇసుక అంశం, మద్యం పాలసీ, ఆర్టీసీ చార్జీల పెంపు, ఇంగ్లీషు మీడియం వ్యవహారం, తిరుమల డిక్లరేషన్, కొడాలి నాని ఇష్యూ, సీఎం జగన్ కోర్టు హాజరు మినహాయింపు, అమరావతి నిర్మాణం, పోలవరం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు కాచుకుని ఉన్నాయి.

అటు ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఎలాంటి జవాబులు చెప్పాలో అధికార పక్షం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు జరగాలన్నది శాసనసభా వ్యవహారాల కమిటీభేటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు.
Andhra Pradesh
Assembly
YSRCP
Jagan
Chandrababu
Telugudesam

More Telugu News