Tirumala: నెయ్యికి మంటలు అంటుకోవడంతో తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదం

  • తిరుమలలో అగ్నిప్రమాదం
  • నెయ్యి పోస్తుండగా అంటుకున్న మంటలు
  • మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అగ్నిప్రమాదం జరిగింది. లడ్డూ తయారీలో ఉపయోగించే బూందీ కోసం నెయ్యి వంపుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బూందీ పోటులో గోడలకు నెయ్యి అంటుకుని ఉండడంతో మంటలు మరింత పెరిగాయి. కొద్దిసమయంలోనే మంటలు వ్యాపించడంతో బూందీ పోటులో ఉన్న కార్మికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు కూడా పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
Tirumala
Boondy
Fire Accident
Andhra Pradesh

More Telugu News