Arjun Suravaram: టీ కొట్టు పక్కన తన కొత్త సినిమా సీడీలు చూసి నిర్ఘాంతపోయిన హీరో నిఖిల్

  • ఇటీవలే విడుదలైన అర్జున్ సురవరం
  • హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం
  • సక్సెస్ మీట్ కు వెళ్లివస్తూ రోడ్డు పక్కన సీడీలు గమనించిన నిఖిల్
టాలీవుడ్ లో కథాబలం ఉన్న వెరైటీ చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న యువ హీరోల్లో నిఖిల్ ముందువరుసలో ఉంటాడు. నిఖిల్ నటించిన అర్జున్ సురవరం చిత్రం ఇటీవలే రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, నిఖిల్ తన సినిమా సక్సెస్ టూర్ కోసం గుంటూరు వెళ్లాడు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని హైవేపై ఉన్న ఓ టీ దుకాణం వద్ద ఆగాడు. అయితే ఆ పక్కనే సీడీలు అమ్మే బండి వద్దకు వెళ్లి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అర్జున్ సురవరం సీడీలు కూడా వాటిలో ఉండడంతో నిఖిల్ ఆవేదనకు లోనయ్యాడు.

అక్కడున్న వారిని సినిమా చూశారా అని అడగ్గా, డీవీడీలో చూశాం అని చెప్పడంతో మరింత బాధపడ్డాడు. సినిమాను ఎంతో ఖర్చు చేసి తీస్తామని, వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి బతుకుతున్నాయని, దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని వారిని కోరాడు. పైరసీ కారణంగా సినిమా థియేటర్లకు జనం రారని, ఇలాంటి పరిణామాలతో చిత్రరంగం దెబ్బతింటుందని, తద్వారా దానిపై ఆధారపడి బతుకుతున్న వేలాదిమంది బతుకులు రోడ్డునపడతాయని తెలిపాడు.
Arjun Suravaram
Nikhil
Tollywood
Guntur
Piracy
CD

More Telugu News