Chattisghad: నాలుగు రోడ్ల కూడలిలో పోలీసు 'ట్రాఫిక్ డ్యాన్స్'... వీడియో ఇదిగో!

  • దుమ్ము, కాలుష్యం మధ్య ట్రాఫిక్ విధులు
  • నృత్యం చేస్తూ పనిని ఆస్వాదిస్తున్న మహ్మద్ మోసిన్
  • నెటిజన్లను ఆకర్షిస్తున్న వీడియో

ఓ వైపు ఎండ, మరోవైపు దుమ్ము, వాహనాల నుంచి వెలువడే కాలుష్యం. వీటన్నింటి మధ్యా నిలబడి, ట్రాఫిక్ ను నియంత్రిస్తూ, డ్యాన్స్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. చత్తీస్ గఢ్ లోని యాయ్ పూర్ లోని ఓ చౌరస్తాలో మహ్మద్ మోసిన్ షేక్ అనే కానిస్టేబుల్ కాస్తంత వెరైటీగా ట్రాఫిక్ విధులను నిర్వర్తించారు. రోడ్డుపై ట్రాఫిక్ డ్యాన్స్ చేస్తూ, వచ్చి పోయే వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, తన విధులను నిర్వర్తిస్తున్నారు.

ఇక తన వీడియో వైరల్ అవడంపై స్పందిస్తూ, ఇలా ట్రాఫిక్ డ్యాన్స్ చేయడం ద్వారా తన పనిని మరింతగా ఆస్వాదిస్తున్నానని, గతంలో మధ్యప్రదేశ్ కు చెందిన రంజిత్ అనే కానిస్టేబుల్ చేసిన ట్రాఫిక్ డ్యాన్స్ ను చూసి స్ఫూర్తి పొందానని అన్నారు. ఇక దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ, ఈ పద్ధతిలో ట్రాఫిక్ నియంత్రణ అభినందనీయమని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, కానిస్టేబుల్ ఫిట్ గా ఉండేందుకూ తోడ్పడుతుందని వ్యాఖ్యానించారు. మహ్మద్ మోసిన్ ట్రాఫిక్ డ్యాన్స్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News