మాకు మద్దతుగా పోరాడతామని ప్రియాంకా గాంధీ చెప్పారు.. మృగాళ్లకు మరణశిక్ష వేయాలి: ఉన్నావో కేసు బాధిత కుటుంబం
- బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రియాంకా గాంధీ
- ఆ కుటుంబానికి న్యాయం కోసం పోరాడతామన్న ప్రియాంక
- బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు
కాగా, ఉన్నావోకు చెందిన ఆ యువతిపై గతేడాది పెళ్లి పేరుతో ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మృగాడు బెయిల్ పై బయటకు వచ్చాడు. గురువారం ఉదయం కోర్టు విచారణ నిమిత్తం బాధితురాలు ఒంటరిగా బయలుదేరింది. ఆ సమయంలో బాధితురాలిపై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి ఒంటికి నిప్పంటించడంతో, ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఆసపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయింది. 2017లో ఉన్నావోలో జరిగిన అత్యాచారం ఘటన, ఈ తాజా ఘటన వేర్వేరు. 2017 ఘటనలో బీజేపీ నేత కుల్దీప్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.