health: భారత పరిశోధకుల ఘనత.. పురుషులకు 'కుటుంబ నియంత్రణ' ఇంజెక్షన్‌ రెడీ

  • ఇప్పటివరకు పురుషులకు ఇందుకోసం వేసెక్టమీ ఆపరేషన్
  • ఆపరేషన్ అవసరం లేకుండా ఇంజెక్షన్
  • 13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట
  • ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవంటోన్న పరిశోధకులు

కుటుంబ నియంత్రణకు ఇప్పటివరకు ఉన్న ఒకే ఒక్క మార్గం 'ఆపరేషన్' మాత్రమే. ఇందు కోసం భార్య కాకుండా భర్త ముందుకు వస్తే వారికి వేసెక్టమీ ఆపరేషన్ చేసేవారు. ఇకపై ఆపరేషన్ అవసరం లేకుండానే సంతానోత్పత్తిని అరికట్టే అవకాశం ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పురుషులకు కుటుంబ నియంత్రణ ఇంజెక్షన్‌ సిద్ధమయింది. భారత పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పరిశోధకులు విజయవంతంగా క్లినికల్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక ఈ ఇంజెక్షన్ ఆమోదం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీజీసీఐ)కు పంపారు.

రివర్సిబుల్  ఇన్ హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్  (ఆర్ఐఎస్యూజీ) అని ఈ ఇంజెక్షన్ కు పేరు పెట్టారు. స్టైరీన్ మేలియక్ ఆన్ హైడ్రైడ్ అనే పదార్థంతో రూపొందించిన ఈ ఇంజెక్షన్ తో 13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట వేయొచ్చు. ఈ ఇంజెక్షన్ విజయాల రేటు 97.3 శాతంగా ఉందని, అంతేగాక, దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని పరిశోధకులు తెలిపారు. ఈ ఇంజెక్షన్ ను విజయవంతంగా అభివృద్ధి చేసిన ఘనత ఇప్పటికీ అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకూ దక్కలేదు.

More Telugu News