మృతి చెందిన టీఎస్సార్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత
- జీహెచ్ఎంసీ పరిధిలోని 10 కుటుంబాలకు న్యాయం
- ముఖ్యమంత్రి మాట మేరకు నియామకాలు
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం కూడా
సమ్మె విరమణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి మాట ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి కానిస్టేబుల్, ఒకరికి కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి మాట ఇచ్చారు.