దిశ ఎన్ కౌంటర్.. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల తరలింపు

  • పోస్టుమార్టం అనంతరం స్వస్థలాలకు మృతదేహాల తరలింపు
  • చెన్నకేశవుల కుటుంబసభ్యులకు చెందిన పొలం వద్ద అంత్యక్రియలు
  • ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు?
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దిశ కేసు నిందితుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం నలుగురి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలిస్తారని సమాచారం. మరోపక్క నారాయణ్ పేట్ జిల్లా గుడిగండ్లలో భారీగా పోలీసులను మోహరించారు. నిందితుల మృతదేహాలకు నేరుగా అంత్యక్రియలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శివ, నవీన్, చెన్నకేశవుల మృతదేహాలకు గుడిగండ్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నకేశవుల కుటుంబసభ్యులకు చెందిన పొలం వద్ద ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామ పెద్దల ద్వారా చెన్నకేశవుల కుటుంబసభ్యులను పోలీసులు ఒప్పించినట్టు సమాచారం. మహ్మద్ ఆరిఫ్ అంత్యక్రియలను జక్లేర్ లో నిర్వహించనున్నారు.  ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
Go Back to Shorts
Disa
Encounter
Mahabubnagar
Govt.Hospital

More Telugu News