Maharashtra: అజిత్ పవార్ కు కీలక కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన మహారాష్ట్ర ఏసీబీ!

  • పదేళ్ల క్రితం నీటిపారుదల శాఖలో కుంభకోణం
  • ఆధారాలు లభించలేదు
  • కోర్టుకు 16 పేజీల అఫిడవిట్

పదేళ్ల క్రితం మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన నీటి పారుదల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఊరట లభించింది. మహారాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఈ కేసులో అజిత్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ మేరకు నవంబర్ 27 నాటి తేదీతో బాంబే హైకోర్టుకు ఏసీబీ సూపరింటెండెంట్ రష్మీ నందేద్కర్ పేరిట 16 పేజీల అఫిడవిట్ అందింది. ఈ కేసులో అజిత్ పవార్ కు వ్యతిరేకంగా ఏ విధమైన ఆధారాలు లభించలేదని ఆమె తెలిపారు. ఆ సమయంలో అజిత్, విదర్భ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారని, నిధులను విడుదల చేయడంలో ఎటువంటి అవకతవకలూ జరగలేదని స్పష్టం చేశారు.

More Telugu News