justice for Disa: వారు సామాన్యులు కాబట్టి చంపేశారు...నా బిడ్డ విషయంలో ఈ న్యాయం ఏమైంది?: అయేషా మీరా తల్లి

  • పన్నెండేళ్లయినా అసలైన నిందితులను గుర్తించలేదు 
  • రాజకీయ పరపతి ఉండడం వల్లే కదా ఇది 
  • సజ్జనార్ లాంటి అధికారి దర్యాప్తు చేసుంటే న్యాయం జరిగేది

దిశపై అఘాయిత్యానికి పాల్పడి అన్యాయం చేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టి ఈజీగా వారిని కాల్చిచంపేశారని, అదే తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు న్యాయం జరగడం లేదని పన్నెండేళ్ల క్రితం అత్యాచారానికి, హత్యకు గురైన అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ప్రశ్నించారు. 


దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆమె స్పందించారు. 'దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగినందున వారు సంతోషించవచ్చు, కానీ నాలాంటి వారి పరిస్థితి ఏమిటి?' అని ప్రశ్నించారు. పందొమ్మిదేళ్ల ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరాను గుర్తు తెలియని వ్యక్తులు 2007, డిసెంబరు 27న విజయవాడలోని ఆమె నివాసం ఉంటున్న హాస్టల్ లోనే అత్యాచారం చేసి హత్య చేశారు. బాత్ రూంలో మృతదేహం పడివుండగా, 'తన ప్రేమను తిరస్కరించినందుకే ఆమెపై అత్యాచారంచేసి చంపేశాను' అని నిందితుడు లెటర్ రాసి మరీ ఆమె పక్కన పడేశాడు.

తన కుమార్తెకు ఇంత అన్యాయం జరిగినా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని, కుమార్తె ఆత్మశాంతించలేదని అయేషా తల్లి వాపోయారు. సజ్జనార్ లాంటి పోలీసు అధికారి తమ కుమార్తె కేసు దర్యాప్తు చేసి ఉంటే తమకు న్యాయం జరిగి ఉండేదేమోనని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News