ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే: 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ హోంమంత్రి సుచరిత

  • చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది
  • నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు
  • దిశ లాంటి ఘటనలు మరోసారి జరగకూడదు
దిశ హత్యాచార కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... దిశ హత్యకేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని అన్నారు. నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని, అందుకే హైదరాబాద్ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని అన్నారు. దిశ లాంటి ఘటనలు మరోసారి జరగకూడదని తాను కోరుకుంటున్నానని అన్నారు.

కాగా, ఇదే విషయంపై సుచరిత ట్వీట్ చేశారు. 'పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

దిశ హత్యకేసులో నిందితుల విచారణలో భాగంగా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.  
Go Back to Shorts
sucharita
Andhra Pradesh
Disha

More Telugu News