హైదరాబాద్ పోలీసులను చూసి ఢిల్లీ, యూపీ పోలీసులు నేర్చుకోవాలి: మాయావతి
- ఉత్తరప్రదేశ్ లో నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి
- కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుండా నిద్రపోతోంది
- దురదృష్టవశాత్తూ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారు
ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'ఉత్తరప్రదేశ్ లో నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుండా నిద్రపోతోంది. హైదరాబాద్ పోలీసులను చూసి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు నేర్చుకోవాలి. కానీ, ఇక్కడ దురదృష్టవశాత్తూ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జంగిల్ రాజ్ కొనసాగుతోంది' అని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.