నీరవ్ మోదీ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడే.. ముంబై స్పెషల్ కోర్ట్ స్పష్టీకరణ
- న్యాయస్థానం తాజా ప్రకటనతో నీరవ్ కు పెద్ద ఎదురుదెబ్బ
- పీఎన్బీని 14 వేల కోట్లకు ముంచిన నీరవ్
- ప్రస్తుతం నార్త్ లండన్ లోని వాన్ డ్స్ వర్త్ జైలులో ఉన్న నీరవ్
ఆర్థిక నేరాల్లోనే సంచలనం కలిగించిన నీరవ్ మోదీ కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంకు 14 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ కుంభకోణం భయటపడుతుందనగా నీరవ్ లండన్ కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై ఆయన్ను తమకు అప్పగించాలంటూ భారత దేశం బ్రిటన్ కు పలుమార్లు విన్నవించింది. దీనికి స్పందించిన అక్కడి ప్రభుత్వం నీరవ్ ను అరెస్ట్ చేసింది. ఇక తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన ఇప్పటికే 4 సార్లు లండన్ కోర్టుకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆయన నార్త్ లండన్ లోని వాన్ డ్స్ వర్త్ జైలులో ఉన్నారు.