Alia Bhat: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఆలియా మెచ్చిన మన హీరో!
  • 'హిరణ్య కశ్యప' అప్ డేట్స్ 
  • నెగటివ్ క్యారెక్టర్ లో మీనా

   *  మన విజయ్ దేవరకొండ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ మనసు దోచుకున్నాడు. ఈ విషయాన్ని ఆలియానే తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది స్టయిల్ పరంగా మీకు నచ్చిన హీరో హీరోయిన్లు ఎవరని ఆమెను అడిగితే, 'హీరోయిన్లలో అనుష్క శర్మ నా ఆల్ టైం ఫేవరైట్ .ఇక హీరోలలో విజయ్ దేవరకొండ. అతని స్టయిల్ అద్భుతం.. నాకు బాగా నచ్చుతుంది' అని చెప్పింది.
*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా 'హిరణ్య కశ్యప' పేరిట భారీ పౌరాణిక చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం షూటింగును వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి నుంచి రానా ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చాడట. సెట్స్ పని ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం.
*  అజిత్ కు పలు హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ చిత్రాన్ని చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, ఇందులో ప్రముఖ నటి మీనా ఓ నెగటివ్ క్యారెక్టర్ ను పోషించనుందని తెలుస్తోంది. 

More Telugu News