Chidhambaram Release on Bail: తీహార్ జైలునుంచి విడుదలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

  • బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • 106 రోజుల పాటు జైలు జీవితం
  • స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి రిమాండ్ లో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఈ రోజు తీహార్ జైలునుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. 106 రోజులపాటు జైలులో ఉన్న చిదంబరానికి సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన జైలు నుంచి వస్తోన్న సమయంలో కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం చెప్పారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు.

ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. చిదంబరంపై ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఆయన రిమాండులో వున్న విషయం తెలిసిందే. ఈ రోజు సుప్రీంకోర్టు ఆయనకు రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును కూడా కోరింది. విడుదల అనంతరం చిదంబరం మాట్లాడుతూ..కోర్టు తీర్పును గౌరవిస్తానని, కేసు గురించి వ్యాఖ్యానించనని పేర్కొన్నారు. తనపై ఒక్కఅభియోగం కూడా నిరూపితం కాలేదన్నారు. 

More Telugu News