శబరిమలకు తానెందుకు వెళ్లకూడదని భర్తను అడిగిన భార్య అన్నా లెజినోవా... పవన్ కల్యాణ్ ఏం చెప్పారో తెలుసా?
- ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న పవన్
- ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుంది
- అయ్యప్ప తపస్సులో ఉంటారు కాబట్టి మహిళలను చూడరు
- అన్నా లెజినోవాకు వివరించిన పవన్
శబరిమల గురించి తన భార్య అన్నా లెజినోవో తనను అడిగిందని గుర్తు చేసుకున్నారు. శబరిమలకు తానెందుకు వెళ్లరాదని ఆమె ప్రశ్నించిందని చెబుతూ, ఆ సమయంలో "నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు?" అని అడిగానని, దానికామె, అది తమ సంప్రదాయమని చెప్పిందని అన్నారు.
అదే విధంగా ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని తాను చెప్పానని, అయ్యప్పస్వామి బ్రహ్మచారని, అనునిత్యమూ తపస్సులో ఉంటారు కాబట్టే, మహిళలను ఆయన చూడరని, అందువల్లే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని వివరించానని పవన్ తన కార్యకర్తలకు తెలిపారు. రెచ్చగొట్టాలని చూస్తున్న కొందరు మాత్రమే శబరిమలపై కోర్టును ఆశ్రయించారని, ఆలయ వివాదంపై తన తల్లి కూడా బాధపడిందని అన్నారు.