టీఎస్ ఆర్టీసీ సమ్మె కాలంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన
- సమ్మె విరమణతో మా ఉద్యోగాలు పోయాయి
- సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పనిచేస్తున్న ఉద్యోగాలు వదిలి మరీ వచ్చాము
- పర్మినెంట్ అయ్యే అవకాశం లభిస్తుందన్న ఆశతో పనిచేశాము
ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తాము అప్పటివరకు పనిచేస్తున్న ఉద్యోగాలు వదలి మరీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా 52 రోజులు పనిచేశామన్నారు. కేసీఆర్ ఇప్పటివరకు తాత్కాలిక ఉద్యోగుల గురించి స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పర్మినెంట్ అయ్యే అవకాశం లభిస్తుందన్నఆశతో పనిచేశామన్నారు. ఈ విషయంలో తమకు బాధే మిగిలిందన్నారు.