Nikhil: 'అర్జున్ సురవరం' 3 రోజుల వసూళ్లు

  • క్రితం నెల 29న వచ్చిన 'అర్జున్ సురవరం'
  • తొలిరోజునే పాజిటివ్ టాక్ 
  • 3 రోజుల్లో 12 కోట్లకి పైగా వసూళ్లు 

నిఖిల్ కథానాయకుడిగా సంతోష్ దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ సురవరం' సినిమా, క్రితం నెల 29వ తేదీన విడుదలైంది. తొలి రోజునే ఈ సినిమా 4 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత రెండు రోజుల్లోను ఈ సినిమా అదే ఊపును కొనసాగించింది. అందువలన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 రోజుల్లో 12.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఈ వారంలో ఈ సినిమాకి గట్టిపోటీ ఇచ్చే సినిమాలేవీ లేవనే చెప్పాలి. అందువలన ఈ సినిమా వసూళ్లు నిలకడగా వుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందని అంటున్నారు. మొత్తానికి కాస్త లేట్ అయినాగానీ నిఖిల్ గట్టి హిట్టే కొట్టేశాడు.

More Telugu News