Raviteja: వరలక్ష్మి శరత్ కుమార్ దుమ్మురేపేస్తుందట!

  • రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని సినిమా 
  •  కథానాయిక పాత్రలో శ్రుతి హాసన్ 
  •  పవర్ఫుల్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్

కోలీవుడ్లో కథానాయికగా తన కెరియర్ ను మొదలుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్, ఆ తరువాత నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను కూడా చేస్తూ వెళుతోంది. ఈ తరహా పాత్రలే అక్కడ ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. లేడీ విలన్ తరహా పాత్రలకి అక్కడివాళ్లు ముందుగా ఆమెకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోయినా, ఆ సినిమాలో వరలక్ష్మి పాత్రకు మంచి అప్లాజ్ లభించింది.

తాజాగా ఆమె రవితేజ సినిమాలోను ఒక పాత్రను పోషిస్తోంది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా ఆమె రవితేజతో ఆడిపాడే సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఆమె పాత్ర విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. విలక్షణమైన ఈ పాత్రలో ఆమె దుమ్మురేపేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తెలుగులోను వరలక్ష్మి శరత్ కుమార్ బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News