Rajanikant: ప్రత్యేక ప్రతిభావంతుడికి రజనీకాంత్ పాదచాలనం!

  • తిథుల ప్రకారం పుట్టినరోజు జరుపుకున్న రజనీ
  • కేరళ నుంచి అభిమానిని పిలిపించుకుని ముచ్చట్లు
  • 12న వేడుకగా సాగనున్న పుట్టినరోజు

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, తన పుట్టిన తిథి, నక్షత్రం ప్రకారం సోమవారం నాడు పుట్టిన రోజును జరుపుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళకు చెందిన వీరాభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని కలిశారు రజనీ. ప్రత్యేక ప్రతిభావంతుడైన అతనికి కరచాలనం చేసేందుకు చేతులు లేవు. దీంతో రజనీ అతని పాదాలను తాకి పాదచాలనం చేశారు. అతనితో కాసేపు ముచ్చటించారు. ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. తేదీల ప్రకారం, ఈ నెల 12న రజనీ పుట్టిన రోజు కాగా, అత్యంత వేడుకగా జరిపేందుకు అభిమాన సంఘాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

More Telugu News