కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్
- మోదీ, షాలే వలసదారులన్న అధిర్ రంజన్
- మరి సోనియా సంగతేంటన్న బీజేపీ
పౌరసత్వ సరవణ బిల్లును వ్యతిరేకిస్తూ అధిర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇటలీకి చెందిన సోనియాగాంధీ చొరబాటుదారులవుతారా? లేక, గుజరాత్‌కు చెందినవారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ప్రశ్నించారు. చొరబాటుదారులున్న కాంగ్రెస్ పార్టీ ఇతరులను కూడా అదే దృష్టితో చూస్తోందని మంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు.