Nagarjuna: ఆ మూవీలో నాగ్ హీరో కాదట!

  • నాగ్ ప్రధాన పాత్రధారిగా న్యూ మూవీ 
  • దర్శకుడిగా సాల్మన్ పరిచయం
  • హీరోయిన్ గా కొత్త అమ్మాయి 

ఈ మధ్య కాలంలో నాగార్జున హీరోగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల వచ్చిన 'మన్మథుడు 2' నాగ్ అభిమానులు డీలాపడిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలోనే సాల్మన్ అనే కొత్త దర్శకుడితో నాగార్జున ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన సరసన కాజల్ ను అనుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమాలో నాగార్జున హీరో కాదట .. కానీ కథ మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతుందనేది తాజా సమాచారం. అంటే ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్రధారిగా మాత్రమే కనిపించనున్నాడన్న మాట. నాయకా నాయికలుగా ఒక యువ జంట కనిపిస్తుందని అంటున్నారు. వాళ్లలో హీరో సంగతి తెలియదుగానీ, హీరోయిన్ గా మాత్రం కొత్త అమ్మాయినే తీసుకుంటారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

More Telugu News