మెక్సికోలో డ్రగ్స్ ముఠాకు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు.. 19 మంది మృతి

  • దుండగులున్న భవనాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు
  • కొన్ని గంటలపాటు ఎదురుకాల్పులు
  • మృతుల్లో ఇద్దరు పౌరులు, నలుగురు పోలీసులు
మెక్సికోలో భద్రతా బలగాలు, డ్రగ్స్ ముఠాకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మొత్తం 19 మంది  మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని విల్లా యూనియన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఓ భవనంలోకి దుండగులు ప్రవేశించినట్టు తెలుసుకున్న భద్రతా దళాలు భవనాన్ని చుట్టుముట్టాయి. దీంతో డ్రగ్స్ ముఠా కాల్పులు ప్రారంభించింది.

అప్రమత్తమైన భద్రతా దళాలు కూడా కాల్పులు ప్రారంభించడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కొన్ని గంటలపాటు జరిగిన కాల్పుల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది డ్రగ్స్ ముఠాకు చెందిన వారు కాగా, ఇద్దరు పౌరులు, మరో నలుగురు పోలీసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుంచి 14 ట్రక్కులు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు.
Go Back to Shorts
mexico
Drugs
encounter

More Telugu News