Crime News: గుంటూరులో డ్రగ్స్ తయారీ ముఠా : 12 మందిని పట్టుకున్న పోలీసులు

  • నిందితుల్లో పలువురు విదేశీయులు
  • నల్లపాడులో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తింపు
  • ఆన్ లైన్లో అమ్మకాలు

విదేశీయులతో కలిసి డ్రగ్స్ తయారు చేస్తున్న ఓ ముఠాను గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని నల్లపాడులో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో స్థానికులే కాకుండా పలువురు విదేశీయులు చిక్కడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరిలో టాంజానియా, ఈజిప్ట్, నైజీరియా, సౌదీకి చెందిన వారు ఉండడం విశేషం. వీరితోపాటు నల్లపాడుకు చెందిన నలుగురు ఉన్నారు. కాగా, వీరు తయారు చేసిన డ్రగ్స్ ను ఆన్లైన్ లో విక్రయిస్తున్న షాజీని అరెస్టు చేశారు.

Crime News
Guntur District
nallapadu
12 in plice custody

More Telugu News