Kumaram Bheem Asifabad District: అసిఫాబాద్ లో పడవ బోల్తా.. ఇద్దరు అధికారుల గల్లంతు

  • చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద ఘటన
  • ప్రాణహిత నదిలో ఇద్దరు బీట్ ఆఫీసర్ల కోసం గాలింపు
  • వారి పేర్లు బాలకృష్ణ, సురేశ్ గా గుర్తింపు
తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద నదిలో నాటు పడవ బోల్తా పడింది. దీంతో ప్రాణహిత నదిలో ఇద్దరు బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

ప్రాణహిత నదిలో బోల్తా పడింది నాటుపడవ అని తెలుస్తోంది. బీట్ అధికారుల పేర్లు బాలకృష్ణ, సురేశ్ గా అధికారులు గుర్తించారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలోని హాహిరి నుంచి గూడెంకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Kumaram Bheem Asifabad District
boat

More Telugu News