Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ఆహ్లాదకర వాతావరణం... స్పీకర్ గా ఎన్నికైన నానా పటోలే!

  • నామినేషన్ విత్ డ్రా చేసుకున్న కిసాన్ కాథోరే
  • నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవం
  • బాధ్యతలు స్వీకరించిన కొత్త స్పీకర్

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నేత నానా పటోలే స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున స్పీకర్ పదవికి పోటీలో నిలిచిన కిసాన్ కాథోరే తన నామినేషన్ ను ఈ ఉదయం వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉదయం సమావేశమైన అసెంబ్లీలో, ప్రోటెమ్ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్, నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవమైందని ప్రకటించారు.

ఆపై పార్టీలకు అతీతంగా సీఎం ఉద్ధవ్ థాకరే, విపక్ష నేత ఫడ్నీవీస్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. ముఖ్య నేతలంతా కలిసి నానా పటోలేను తోడ్కొని వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. కాగా, విదర్భ ప్రాంతం నుంచి వచ్చిన నానా పటోలే, మోదీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తొలి నేతల్లో ఒకరు. ఆయన కాంగ్రెస్ లో చేరి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై పోటీ చేసి ఓడిపోయారు. ఆపై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి, ఇప్పుడు స్పీకర్ గా మారారు.

More Telugu News