Amrutha: అమృతకు ప్రలోభాలు... మిర్యాలగూడ మారుతీరావు మళ్లీ అరెస్ట్!

  • తీవ్ర కలకలం రేపిన ప్రణయ్ హత్య కేసు
  • తాజాగా ఆస్తి పంపకాలంటూ ప్రలోభాలు
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు
మిర్యాలగూడలో తీవ్ర కలకలం రేపిన ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావును పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు కరీమ్, వెంకటేశ్వరావు అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, ఐపీసీ సెక్షన్ 452, 506, 195 ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టగా, కోర్టు వీరికి రెండు వారాల రిమాండ్ విధించింది.

ఆస్తి పంపకాలపై తనను ప్రలోభ పెట్టాలని తండ్రి ప్రయత్నిస్తున్నారని, తన ఇంటికి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పంపారని అమృత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. కులం తక్కువ యువకుడిని అమృత ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో, మారుతీరావు పరువు హత్యకు పాల్పడగా, ఈ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Amrutha
Marutirao
Arrest

More Telugu News