Chilukur: వెటర్నరీ వైద్యురాలి హత్య నేపథ్యంలో... చిలుకూరు బాలాజీ ఆలయం 20 నిమిషాల పాటు మూసివేత!

  • 20 నిమిషాలు ఆలయం మూసివేత
  • ఆపై భక్తులతో మహా ప్రదక్షిణ
  • స్త్రీ జాతిని రక్షిద్దామంటూ నినాదాలు
బుధవారం రాత్రి వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యాచారానికి నిరసనగా శనివారం నాడు చిలుకూరులోని బాలాజీ ఆలయాన్ని పూజారులు మూసివేశారు. 20 నిమిషాల పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేసి, దర్శనాలను నిలిపివేశారు. ఆపై భక్తులతో మహా ప్రదక్షిణ చేయించారు. "రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీ జాతిని రక్షిద్దాం" అంటూ నినాదాలు చేస్తూ, భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆపై దర్శనాలను తిరిగి పునరుద్ధరించారు.

ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడిన ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదని అన్నారు. ఈ సమాజం ఎటుపోతున్నదో అర్థం కావడంలేదని, మహిళలు సురక్షితంగా ఉండాలని వెంకటేశ్వరుని ప్రార్థించామని తెలిపారు.
Chilukur
Balaji
Temple
Close

More Telugu News