Venkatesh: రాశిఖన్నా బర్త్ డే కానుకగా 'వెంకీమామ' నుంచి స్పెషల్ గిఫ్ట్

  • 'వెంకీమామ' నుంచి డైలాగ్ వీడియో
  • చైతూ జోడీగా అలరించనున్న రాశి ఖన్నా
  • డిసెంబర్ 25వ తేదీన విడుదల

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. అమాయకత్వంతో కూడిన అందం రాశిఖన్నా సొంతం. కెరియర్ ను మొదలెట్టిన దగ్గర నుంచి నిదానమే ప్రధానమన్నట్టుగా ఆమె ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతోంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె తాజా చిత్రాల నుంచి స్పెషల్ వీడియోలను వదులుతున్నారు.

తాజాగా 'వెంకీమామ' టీమ్ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా నుంచి సందర్భానికి తగిన ఒక డైలాగ్ వీడియోను విడుదల చేశారు. వెంకటేశ్ - పాయల్ ఒక జంటగా కనిపించనున్న ఈ సినిమాలో ఆమె చైతూ జోడీగా అలరించనుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News