Disha: ఇల్లు, ఉద్యోగం తప్ప తమ బిడ్డకు మరో వ్యాపకం లేదని ప్రియాంక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు: మంత్రి సబిత

  • వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సజీవదహనం
  • అత్యాచారం చేసి ఆపై తగులబెట్టిన దుండగులు
  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. స్కూటీ పాడైపోయి ఆపదలో ఉన్న అమ్మాయిపై ఇంత ఘోరానికి ఎలా ఒడిగట్టారని, వీళ్లసలు మనుష్య జాతికి చెందినవాళ్లేనా అంటూ ఘటనను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రియాంక రెడ్డి నివాసానికి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. జరిగిన దుస్సంఘటన పట్ల వారికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిందితులకు కఠినశిక్షలు పడడం తథ్యమని తెలిపారు.

ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మంత్రి సబిత మీడియాతో మాట్లాడుతూ, నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఇల్లు, ఉద్యోగం తప్ప మరో వ్యాపకం లేని తమ బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కన్నుమూయడం పట్ల ప్రియాంక తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు.

కాగా, మంత్రి సబిత తమ నివాసానికి వచ్చిన సమయంలోనూ ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులు ఇంకా షాక్ లోనే ఉన్నారు. ప్రియాంక రెడ్డి చనిపోయిన తీరు వారిని తీవ్రంగా కలచివేస్తోంది.

More Telugu News