Shirdi Saibaba: పీక్స్ కు చేరిన అభిమానం.. శిరిడీ సాయిబాబాకు వైసీపీ జెండా!

  • ఎక్కడ పడితే అక్కడ పార్టీ రంగులు వేస్తున్న వైసీపీ శ్రేణులు
  • చీపురుపల్లిలో సాయిబాబాకు వైసీపీ జెండా కట్టిన వైనం
  • ఇకపై జాగ్రత్తలు తీసుకుంటామన్న పూజారులు
ఏపీలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ వారి పార్టీ రంగులు వేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు.... ఇలా అదీ, ఇదీ అనే తేడా లేకుండా రంగులు పూస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మరో ఘటన చోటు చేసుకుంది.

గుడిలో ఉన్న శిరిడీ సాయిబాబా విగ్రహానికి వైసీపీ జెండాను కప్పారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూజారులు స్పందిస్తూ, మరుసటి రోజే జెండాను తొలగించామని చెప్పారు. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ గడ్డపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Shirdi Saibaba
YSRCP Flag

More Telugu News