Crime News: మా అబ్బాయి రాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడు.. 3 గంటలకు పోలీసులు తీసుకెళ్లారు!: ప్రియాంకారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పాషా తల్లి

  • నిన్న తెల్లవారు జామున 3 గంటలకు పోలీసులు పాషాను తీసుకెళ్లారు
  • ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు
  • ఐదేళ్ల నుంచి నా కుమారుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు
పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి అపహరణ, అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నారాయణ పేట మక్తల్ మండలంలోని  జిక్లేరుకు చెందిన మహ్మద్ పాషా ఉన్నాడు. అతడి తల్లి ఈ రోజు మీడియాతో మాట్లాడి పలు వివరాలు తెలిపింది.
 
జిక్లేరులోని తమ ఇంటి నుంచే మహ్మద్ పాషాను పోలీసులు తీసుకెళ్లినట్లు అతడి తల్లి వెల్లడించింది. అయితే, ఎందుకు తీసుకెళ్లారో తనకు తెలియదని చెప్పింది. ఐదేళ్ల నుంచి తన కుమారుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని వివరించింది. అతడు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడని, ఆ తర్వాత 3 గంటలకు పోలీసులు వచ్చి తీసుకెళ్లారని తెలిపింది. కాగా, నిందితులను పోలీసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టి అన్ని విషయాలను వివరించనున్నారు.
Crime News
Hyderabad
Telangana

More Telugu News