Srikakulam District: ఇంకోసారి ఇలా జరిగితే స్పాట్ లోనే కొట్టేస్తాను: అధికారులపై ఏపీ స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

  • శ్రీకాకుళంలో ఫూలే వర్థంతి వేడుకలు
  • ప్రొటోకాల్ పాటించలేదంటూ తమ్మినేని ఆగ్రహం
  • మళ్లీ తప్పు చేయవద్దంటూ వార్నింగ్
శ్రీకాకుళం జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారులపై ఏపీ స్పీకర్ తమ్మినేని నోరు జారారు. జ్యోతిరావు ఫూలే వర్థంతి వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని అంటూ, "ఇది కూడా మేము మీకు చెప్పాలా ప్రత్యేకించి? హా... అంబేద్కర్ నీ, ఫూలేనీ... వీళ్లందరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పాలా? స్టాపిట్. ఇంకొక్కసారి ఇలా జరిగితే స్పాట్ లో కొట్టేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? మళ్లీ మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. (ఆ సమయంలో అక్కడున్న ఓ అధికారి తప్పు తనది కాదని, తనకు కూడా ఉదయం వరకూ తెలియదని వేడుకునే ప్రయత్నం చేశారు) మీరు కాదు ఎవరైనాగానీ..." అని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Srikakulam District
Tammineni
Phule

More Telugu News