Ranga Reddy District: షాద్‌నగర్‌లో కలకలం.. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని సజీవ దహనం చేసిన దుండగులు

షార్ట్స్‌లో చూడండి
ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. అక్కడి రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

టీవీలో ఓ మృతదేహం గురించి వార్త చూసిన ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఘటనాస్థలి వద్దకు వెళ్లి, అది తన కూతురిదేనని గుర్తించారు. వారి కుటుంబం శంషాబాద్ లో నివసిస్తోంది. ఆమె మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో వెటర్నరీ వైద్యురాలని పోలీసులు చెప్పారు. నిన్న విధులకు వెళ్లి ఆమె తిరిగిరాలేదు.

ప్రియాంకారెడ్డి నిన్న సాయంత్రం తనకు ఫోన్ చేసి మాట్లాడిందని ఆమె అక్క మీడియాకు తెలిపింది. తిరిగి వస్తున్న సమయంలో ప్రియాంక స్కూటీ పాడైపోయిందని చెప్పిందని,  తనకు చాలా భయంగా ఉందని, అక్కడి స్థానికులు తన స్కూటీని రిపేర్‌ చేయిస్తామని తీసుకెళ్లారని, అయితే, దుకాణాలు మూసి ఉన్నాయని మళ్లీ తీసుకొచ్చారని ఆమె చెప్పిందని పేర్కొంది.  

దీంతో తన చెల్లిని అక్కడ ఉండవద్దని చెప్పానని, సమీపంలోని టోల్‌గేట్‌ వద్దకు వెళ్లమని అన్నానని వివరించింది. ఆ తర్వాత ఫోన్ కట్ అయిందిని తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో లారీ డ్రైవర్లు ఎక్కువగా ఉంటారు.
Go Back to Shorts
Ranga Reddy District
Crime News

More Telugu News