Andhra Pradesh: డిసెంబరు 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
- నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్
- ఉదయం 9 గంటలకు శాసన సభ సమావేశాలు
- 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం
వచ్చే నెల 9వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
దీంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బుధవారం అసెంబ్లీలోని వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ మల్లాది విష్ణు తదితరులు సమావేశమయ్యారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించేందుకు ఎమ్మెల్యేలను బృందాలుగా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.