Amit Shah: అమరావతిని గుర్తించినందుకు థ్యాంక్యూ సార్!: అమిత్ షాను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ ఎంపీలు

  • అమరావతిని గుర్తిస్తూ సవరించిన మ్యాప్ విడుదల
  • చంద్రబాబు రాసిన లేఖ అందజేత
  • తనను కలిసేందుకు ఎప్పుడైనా రావొచ్చన్న షా
కేంద్రం ఇటీవల విడుదల చేసిన భారతదేశ రాజకీయ మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఇటీవల సవరించిన మ్యాప్‌ను విడుదల చేసింది.

కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతిని గుర్తించినందుకు హర్షించిన టీడీపీ ఎంపీలు నిన్న కేంద్రమంత్రి అమిత్‌ షాను కలిశారు. ఏపీ రాజధాని అమరావతిని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాసిన లేఖను వారు కేంద్రమంత్రికి అందించారు. అలాగే, రాష్ట్రంలోని సమస్యలపై చర్చించేందుకు తమకు కొంత సమయం కేటాయించాలని ఈ సందర్భంగా ఎంపీలు కోరారు. స్పందించిన షా తనను కలిసేందుకు ఎప్పుడైనా రావొచ్చని సూచించారు.
Amit Shah
Telugudesam
Andhra Pradesh
amaravathi

More Telugu News