Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు!

  • సిద్ధిపేట సమీపంలో ఘటన
  • కారులో కుటుంబీకులతో వెళుతున్న సంపూర్ణేశ్
  • త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఉదయం సిద్ధిపేట సమీపంలో సంపూర్ణేశ్, తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కొత్త బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు అతని కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. సంపూర్ణేశ్ ముఖానికి, చేతులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఆయన భార్య, కుమార్తె కూడా గాయపడ్డారు. వీరిని చూసి స్పందించిన స్థానికులు, సమీపంలోని ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

More Telugu News