ఇప్పటికీ పట్టుబడకుండా పోలీసులకు చుక్కలు చూపుతున్న గూడూరు తహసీల్దారు హసీనా!
- ఈ నెల 7న సోదరుడిని పంపి లంచం తీసుకున్న హసీనా బీ
- అనిశాకు పట్టుబడటంతో అప్పటి నుంచి పరారీలో
- హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు
కాగా, ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక సీ-క్యాంప్ కార్యాలయంలోని ఓ ఎంపీడీఓ ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆమె కనిపించలేదు. నెల రోజుల మెడికల్ లీవ్ పై ఆమె వెళ్లారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. నేరుగా లంచం తీసుకోలేదు కాబట్టి, ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చని ఆమెకు సన్నిహితంగా ఉండే తహసీల్దార్లు సలహా ఇవ్వడంతోనే ఆమె హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు, బెయిల్ ఇవ్వద్దని కోర్టును అభ్యర్థించారు.