Nara Lokesh: అవినీతిని అరికట్టడానికి అవినీతే స్వయంగా రంగంలోకి దిగితే ఇలా ఉంటుంది: సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్

  • జగన్ పై లోకేశ్ విమర్శలు
  • జగన్ అవినీతి గురించి మాట్లాడడంపై సెటైర్
  • వైసీపీ మంత్రుల వ్యాఖ్యలకూ వీడియోలో స్థానం

వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా మాజీ మంత్రి నారా లోకేశ్ తన విమర్శల్లో మరింత పదును పెంచారు. ఏపీలో అవినీతిపై ప్రభుత్వ పంథాను వ్యంగ్యభరితంగా ఓ వీడియో రూపంలో ట్వీట్ చేశారు. అవినీతిని అరికట్టడానికి అవినీతే స్వయంగా రంగంలోకి దిగితే ఇలా ఉంటుంది అంటూ స్పందించారు. కాగా, జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే కరప్షన్ అనేదే లేకుండా చేస్తానని జగన్ చెప్పడంతో ఈ వీడియో మొదలవుతుంది. అంతేకాదు, ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో తనపై ఉన్న కేసులను యాంకర్ చదివి వినిపిస్తుండగా జగన్ ఇబ్బందిగా కదలడాన్ని కూడా ఈ వీడియోలో చూపించారు. పనిలో పనిగా వైసీపీ మంత్రుల వాగ్ధాటిని కూడా క్లిప్పింగ్స్ రూపంలో ఈ వీడియోలో పొందుపరిచారు.

More Telugu News