Chiranjeevi: చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం దక్కడమే కష్టం .. అయినా సాధించాను: చోటా.కె నాయుడు

  • దాసరిగారు నన్ను ప్రోత్సహించారు
  • నాగార్జునగారు అవకాశాలను ఇచ్చారు 
  • ఆ సినిమాతో చిరంజీవిగారి దృష్టిలో పడ్డానన్న చోటా

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో చోటా.కె నాయుడు మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించిన విషయాలను ప్రస్తావించారు. " కెరియర్ తొలినాళ్లలో నన్ను దాసరిగారు ప్రోత్సహించారు. ఆ తరువాత నాగార్జునగారు వరుసగా తన సినిమాలకి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఓ సందర్భంలో చిరంజీవిగారిని కలిసినప్పుడు, ఆయనతో పనిచేయాలని ఉందని చెప్పాను.

అయితే తనతో చేయడానికి సీనియర్ కెమెరామెన్లు చాలామంది వున్నారని చిరంజీవి అన్నారు. ఆ తరువాత చిరంజీవితో వర్మ ఒక సినిమాను ప్లాన్ చేసి, కెమెరామెన్ గా నన్ను తీసుకున్నారు. కొన్ని కారణాల వలన ఆ సినిమా మధ్యలో ఆగిపోయిందిగానీ, నా పనితీరును చిరంజీవిగారి దృష్టిలో పడేలా చేసింది. దాంతో చిరంజీవిగారు నాకు అవకాశాలను ఇచ్చారు. ఆయనతో కలిసి 9 సినిమాలకి పనిచేశాను. అలా నేను అనుకున్నది సాధించగలిగాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News