Anushka: 'నిశ్శబ్దం' నుంచి షాలినీ పాండే లుక్

  • చిత్రకారిణి పాత్రలో అనుష్క 
  • వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 

అనుష్క ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ 'నిశ్శబ్దం' అనే సినిమాను రూపొందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్రకారిణిగా ఈ సినిమాలో అనుష్క ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఆమె భర్త పాత్రను మాధవన్ పోషించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి షాలినీ పాండే లుక్ ను వదిలారు. భయం .. బాధ .. ఆందోళనతో కూడిన ఆమె లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ఈ సినిమాలో 'సోనాలి' అనే పాత్రలో కనిపించనుందనే విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారా తెలియపరిచారు. ఇతర ముఖ్య పాత్రల్లో మైఖేల్ మాడ్సన్ .. అంజలి .. అవసరాల .. సుబ్బరాజు కనిపించనున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, వివిధ భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News