Vishal: లండన్ లో రిస్కీ ఫైట్లు చేస్తున్న విశాల్

  • విశాల్ హీరోగా మరో యాక్షన్ మూవీ 
  • 'తుప్పరివాలన్'కి సీక్వెల్ 
  • వచ్చే వేసవిలో భారీ విడుదల

తెలుగు .. తమిళ భాషల్లో ఇటీవల విశాల్ నుంచి వచ్చిన 'యాక్షన్' ఓ మాదిరిగా మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో .. భారీ యాక్షన్ తో నిర్మితమైన ఈ సినిమా, అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఈ విషయాన్ని గురించి అంతగా పట్టించుకోకుండా విశాల్ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాడు.

గతంలో వచ్చిన 'తుప్పరివాలన్'కి సీక్వెల్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. 'తుప్పరివాలన్ 2' గా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం 'లండన్'లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. 'తుప్పరివాలన్'లో ప్రసన్న చేసిన పాత్ర కూడా సీక్వెల్ లో కంటిన్యూ అవుతుందని అంటున్నారు. విశాల్ సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను, వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు.

More Telugu News