వారి వల్లే సీఎం అయ్యాను.. వారందరినీ మంత్రులు చేస్తా: యడియూరప్ప

25-11-2019 Mon 09:58
  • 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్లే సీఎం అయ్యా
  • ఇచ్చిన మాట మేరకు వారందరికీ టికెట్ ఇప్పించా
  • కాంగ్రెస్, జేడీఎస్ లపై ప్రజలకు నమ్మకం పోయింది
17 మంది జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని... ఎట్టి పరిస్థితుల్లో వారికి అన్యాయం చేయనని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. అన్యాయం చేయనని వారికి మాట ఇచ్చానని... ఇచ్చిన మాటపై నిలబడతానని చెప్పారు. వారికి హామీ ఇచ్చినట్టుగానే అందరికీ బీజేపీ టికెట్ ఇప్పించానని తెలిపారు. ఉపఎన్నికల్లో వీరు గెలవగానే మంత్రులను చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరోగమనంలో వెళ్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సిద్ధరామయ్య ఇప్పటికీ అనవసరపు విమర్శలు చేస్తున్నారని... ఉపఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం నేర్పుతారని చెప్పారు.