Ntr: చరణ్ .. ఆలియా భట్ రొమాంటిక్ సాంగ్ కోసం భారీ సెట్

  • షూటిగ్ దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చరణ్ - ఆలియా భట్ 
  • కీలక పాత్రల్లో రే స్టీవ్ సన్ .. ఆలిసన్ డూడీ

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన 'ఒలీవియా మోరిస్' నటిస్తుండగా, చరణ్ జోడీగా ఆలియా భట్ కనిపించనుంది. ఈ సినిమాలో ఏడెనిమిది పాటల వరకూ వుంటాయని అంటున్నారు. వాటిలో ఒక రొమాంటిక్ సాంగ్ ను చరణ్ - ఆలియా భట్ కాంబినేషన్లో చిత్రీకరించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సాంగ్ కోసం ప్రత్యేకించి ఒక భారీ సెట్ ను వేస్తున్నారని అంటున్నారు. ఈ సాంగ్ కోసం ప్రస్తుతం చరణ్ - ఆలియా భట్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ సాంగ్ నిలవనుండటం వలన, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. రే స్టీవ్ సన్ .. అలిసన్ డూడీ కీలకమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News