Jammu And Kashmir: కశ్మీర్‌లో తొలిసారిగా త్రివిధ దళాల సంయుక్త యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్.. ఉగ్రవాదుల ఏరివేత ప్రారంభం!

  • రంగంలోకి పారామిలటరీ, మార్కోస్, గార్డ్స్ బృందాలు
  • ఒక్కో ప్రాంతంలో ఒక్కో బృందం ఆపరేషన్
  • ఇప్పటికే ఆరుగురు ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లో చెలరేగిపోతున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా త్రివిధ దళాలను రంగంలోకి దింపింది. ఆర్మీకి చెందిన పారామిలటరీ, నేవీ నుంచి మార్కోస్, ఎయిర్‌ఫోర్స్ నుంచి గార్డ్స్ రంగంలోకి దిగి ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ మూడింటినీ కశ్మీర్‌లో మోహరించినట్టు రక్షణ శాఖ తెలిపింది.

పారామిలటరీ బలగాలు ఇప్పటికే శ్రీనగర్‌లోని ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ప్రాంతంలోకి ప్రవేశించగా, మార్కోస్ బృందం ఉలార్ సరస్సు ప్రాంతంలో, వాయసేనకు చెందిన గార్డ్స్ బృందం లాలాబ్, హజిన్ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ తెలిపింది. మూడు ప్రత్యేక దళాలు కలిసి కశ్మీర్‌లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా, కశ్మీర్‌ లోయలోని రఖ్ హజిన్ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తున్న గార్డ్స్ బృందం ఇప్పటికే ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

More Telugu News