Errabelli: మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా.. ఇద్దరి మృతి

  • హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా ఘటన
  • శనివారం అర్ధరాత్రి చీటూరు గ్రామ సమీపంలో వాహనం బోల్తా
  • తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని కారు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని చీటూరు గ్రామ సమీపంలో గత అర్ధరాత్రి జరిగిందీ ఘటన. హైదరాబాద్ నుంచి మంత్రి పాలకుర్తి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

కాన్వాయ్‌లో ఆయన వెనక వస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ పార్థసారథి (30),  పూర్ణ  (27) అనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అదే వాహనంలో ఉన్న గన్‌మన్ నరేశ్, అటెండర్ తాతారావు, శివలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Errabelli
car accident
janagoan

More Telugu News