day and Test match India vs Bangaladesh: బంగ్లాతో టెస్టులో సెంచరీతో కోహ్లీ సరికొత్త రికార్డు

  • భారత డేనైట్ టెస్టు చరిత్రలో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గా ఘనత
  • డే టెస్టుల్లో లాలా అమర్ నాథ్ పేరున తొలి సెంచరీ రికార్డ్
  • లంచ్ సమయానికి భారత్ 289/4 పరుగులు

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్  మైదానంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న డేనైట్ టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో భారత డేనైట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా కోహ్లీ రికార్డును తన పేరున రాసుకున్నాడు. డే టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన ఘనత లాలా అమర్ నాథ్ పేరున ఉంది. కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకోవడానికి 159 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 12 బౌండరీలున్నాయి. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ శతకం.

కాగా, భారత జట్టు లంచ్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ 130 పరుగులు, రవీంద్ర జడేజా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత జట్టులో చటేశ్వర్ పుజారా 55 పరుగులు, అజింక్య రహానే 51 పరుగులు చేసి జట్టు స్కోరుకు తోడ్పడ్డారు. భారత్ జట్టు ఇప్పటివరకు బంగ్లాపై 183 పరుగుల లీడ్ ను సాధించింది. నిన్న బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

More Telugu News