Hyderabad: హైదరాబాదులో గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి కిందపడిన కారు... ఒకరి మృతి

  • హైదరాబాదులో ప్రమాదం
  • అదుపుతప్పిన కారు
  • 9 మందికి తీవ్రగాయాలు

హైదరాబాదులోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా, కింద ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు అతివేగమే కారణమని ప్రత్యక్షసాక్షుల కథనం. ఫ్లైఓవర్ పైనుంచి దూసుకువచ్చిన కారు కింద ఉన్న మరో రెండు కార్లపై పడింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News