Nithyananda Ashramam: నిత్యానంద ఆశ్రమంలో నరకయాతన పడ్డాను: బెంగళూరు బాలిక

  • స్వామీజీ కోసం వీడియోల్లో నటించాలనేవారు
  • అసభ్య పదాలతో దూషించేవారు
  • భక్తి కార్యక్రమం పేర రెండు రోజులు గదిలో బంధించారు

గుజరాత్ లోని నిత్యానంద స్వామి ఆశ్రమంలో తాను నరకయాతన అనుభవించానని బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల బాలిక తెలిపింది. బాలిక తల్లిడండ్రులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయం తీసుకోవడంతో ఆ బాలిక గత మాసంలో ఆశ్రమం నుంచి బయటపడింది. ఆశ్రమంలో తాను పడ్డ కష్టాలను బాలిక మీడియాకు ఈ రోజు తెలిపింది.

2013లో తాను గురుకులంలో చేరానని, మొదట్లో కార్యక్రమాలు బాగానే ఉండేవని చెప్పింది. 2017 నుంచి అక్కడ అవినీతి జరుగుతోందని తెలిపింది. స్వామీజీ కోసం వ్యాపార ప్రకటనలు చేసేవారమని చెప్పింది. అర్ధరాత్రి లేపి స్వామీజీ కోసం వీడియోలు చేయాలని చెప్పేవారని పేర్కొంది. తన సోదరి కూడా అక్కడ ఉందని, ఆమె వీడియోలన్నీ స్వామీజి అదేశాల ప్రకారమే చేసిందనడానికి తానే సాక్ష్యమని బాలిక చెప్పింది.

స్వామీజీకి లక్షలు, కోట్లలో విరాళాలు వచ్చేవని.. అంతేకాక భూములు కూడా విరాళంగా వచ్చేవని వివరించింది. ఆధ్యాత్మిక కార్యక్రమం పేర తనను రెండు నెలలపాటు గదిలో బంధించారంది. అంతేకాక, అసభ్యంగా తిట్టేవారని కూడా బాలిక ఆరోపించింది. ఇదిలావుంచితే, ఆశ్రమంలో చిక్కుకున్న తన మరో కూతురిని కూడా విడిపించాలని కోరుతూ బాలిక తండ్రి గుజరాత్ హైకోర్టును అశ్రయించారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయంలో నిత్యానందస్వామీజీ ఇప్పటికే విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

More Telugu News