Onions: ఉల్లి ధరలో ఆల్ టైమ్ రికార్డు!

  • క్వింటాలు ఉల్లి రూ. 10 వేలకు
  • రిటైల్ మార్కెట్లో కిలో రూ. 130 వరకూ
  • ఏపీలో సబ్సిడీ ఉల్లికి ఎగబడుతున్న ప్రజలు

నేడు హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. క్వింటాలు నాణ్యమైన ఉల్లి ధర ఏకంగా రూ. 10 వేలు పలికింది. గతంలో ఎన్నడూ ఉల్లికి ఇంత ధర పలికింది లేదు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినడం, ఇదే సమయంలో కర్ణాటక నుంచి రావాల్సిన పంట మార్కెట్ కు రాకపోవడంతో ధర ఇంత భారీగా పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.

 హైదరాబాద్, మలక్ పేటలోని హోల్ సేల్ మార్కెట్లో ఉల్లి ధర కిలోకు రూ. 100 పలుకుతుండగా, అది వినియోగదారులకు చేరేసరికి రూ. 120 నుంచి రూ. 130 వరకూ పెరుగుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు జగన్ సర్కారు సబ్సిడీ ఉల్లిని ప్రవేశపెట్టింది. కిలో ఉల్లిపాయలను రూ. 25కే ఇస్తుండటంతో పలు మార్కెట్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. ఒక వ్యక్తికి ఒక కిలోమాత్రమే సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఉల్లిపాయలు అంత నాణ్యంగా లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

More Telugu News